అనంతపురంలో KG టమాటా రూ. 34
ATP: అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. KG గరిష్ఠ ధర రూ.34గా నమోదైంది. కనిష్ఠంగా రూ.20,సరాసరి KG రూ.27 చొప్పున అమ్ముడుపోతున్నట్లు రాప్తాడు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూపేశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు చీని ధరకాస్త పెరిగింది. 4రోజులు ధరలు తగ్గగా నేడు(ఆదివారం) అనంతపురం మార్కెట్‌లో టన్ను చీనీకాయ గరిష్ట ధర రూ.16000 పలికింది.