పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో
ATP: కణేకల్ మండలం సొల్లాపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం ఎంఈవో భవాని శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఎంఈవో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అలాగే, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.