జిల్లాకు 6.99 కోట్ల వడ్డీ లేని రుణాల
SRPT: రాష్ట్రంలో మహిళల ఆర్థిక బలపాటుకు వడ్డీ లేని రుణాల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత రుణాలు మహిళా సమాఖ్యల ద్వారా పంపిణీ కానున్నాయి. ఇప్పటికే 3.50 లక్షల స్వయం సహాయక సంఘాలకు 300.40 కోట్లు విడుదల చేసినట్టు అధికారలు చెప్పారు. సూర్యాపేట జిల్లాలో 6.99 కోట్ల రూపాయలను శాసనసభ్యుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.