ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి మృతి

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి మృతి

SDPT: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి పుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుకునూర్ పల్లి పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. పుల్లూరుకు చెందిన స్వామి ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఇంటినుంచి వెళ్ళిపోయాడు. శనివారం లకుడారం గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు మృతదేహంపై ఉన్న ఆధారాలతో స్వామిదేనని దృవీకరించారు.