విశ్వవిజేతగా భారత్.. రోహిత్ ఎమోషనల్
భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచిన క్రమంలో మెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ మ్యాచ్ వేళ నవీ ముంబై మైదానంలోనే ఉన్న హిట్ మ్యాన్.. హర్మన్ చివరి క్యాచ్ పట్టి జట్టును గెలిపించగానే ఆకాశం చూస్తూ తన భావోద్వేగం వ్యక్తంచేశారు. కాగా రోహిత్ సారథ్యంలో స్వదేశీ గడ్డపై మెగా టోర్నీ ఆడిన మెన్స్ టీమ్.. టైటిల్ పోరులో తడబడిన సంగతి తెలిసిందే.