ప్రజావాణికి 69 అర్జీలు: కలెక్టర్

ప్రజావాణికి 69 అర్జీలు: కలెక్టర్

KMR: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 69 అర్జీలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.