ఎల్లమ్మ ఆలయంలో చోరి.. కేసు నమోదు
NLR: దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నలుగురు దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి తాళం పగలగొట్టి హుండీలోని నగదను ఎత్తుకెళ్తుండగా గ్రామస్థుడు వారిని అడ్డుకున్నాడు. దీంతో అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.