సుపరిపాలన కావాలంటే మరోసారి మోదీ రావాలి: మాజీ ఎంపీ

ములుగు: ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతి మచ్చలేని పాలన కొనసాగించారని పదేళ్లలో అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా పనిచేశారని మాజీ ఎంపీ, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుపరిపాలన కావాలంటే మరోసారి మోదీ రావాలన్నారు.