బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో సోమవారం బీరప్ప కామరతిల కళ్యాణ మహోత్సవాన్ని మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మల్లికార్జున కురుమ సంఘం సభ్యులు గొంగళి కప్పి ఘనంగా సన్మానించారు.