రైతు ప్రాణాలపైకి తెచ్చిన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
MBNR: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ రైతుకు విద్యుత్ వైర్లు తగిలి పరిస్థితి విషమంగా మారిన సంఘటన మిడ్జిల్ మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పరుశరాములు తన పొలంలో పంట చేనుకు పైపులు మారుస్తుండగా 11 కేవీ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పక్కన ఉన్న రైతు శాంతయ్య తన టవల్ సాయంతో కాపాడారు.