బ్రిడ్జిని ఢీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం
E.G: కొవ్వూరులోని గోదావరి గామన్ బ్రిడ్జిపై శనివారం పెను ప్రమాదం తప్పింది. గామన్ బ్రిడ్జిపై వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఓ కారు ఓవర్టేక్ చేస్తూ ఉండగా నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ వాహనం బ్రిడ్జి పై నుంచి గోదావరిలో పడిపోకుండా చివరి క్షణంలోనే ఆగిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.