మంత్రి సత్యకుమార్‌ను పలకరించిన ప్రధాని మోదీ

మంత్రి సత్యకుమార్‌ను పలకరించిన ప్రధాని మోదీ

సత్యసాయి: మంత్రి సత్యకుమార్‌ను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. అమరావతి పునఃప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెలగపూడిలోని సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు మంత్రి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ క్రమంలో మంత్రి భుజంపై చేయి వేసి ప్రధాని పలకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, సహచర మంత్రులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.