పరీక్షల్లో చాట్‌జీపీటీతో చీటింగ్.. 81 మంది సస్పెండ్

పరీక్షల్లో చాట్‌జీపీటీతో చీటింగ్.. 81 మంది సస్పెండ్

పరీక్షల్లో విద్యార్థులకు సాయం చేసిన 81 మంది సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన 10, 12వ తరగతి పరీక్షల్లో పలు పాఠశాలల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఎగ్జామినేషన్ సిబ్బంది చాట్‌జీపీటీలో చూసి, విద్యార్థులకు సమాధానాలు చెప్పినట్లు తేలిందన్నారు. దీంతో 81 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు.