ప్రముఖ నటుడిపై బీర్ బాటిళ్లతో దాడి

ప్రముఖ నటుడిపై బీర్ బాటిళ్లతో దాడి

కన్నడ నటుడు నిరంజన్‌పై బెంగళూరులో బీర్ బాటిళ్లతో దాడి జరిగింది. నటుడు యశస్ సూర్య ఇంటి నుంచి వస్తుండగా, ఇన్నోవాలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు 'నువ్వు యాక్టర్ అయిన సరే.. ఇది మా ప్రాంతం' అంటూ గొడవకు దిగి తలపై కొట్టారు. ఈ దాడిలో నిరంజన్ గాయపడగా, తన చేతి గడియారం కూడా పోగొట్టుకున్నట్లు ఆయన ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.