VIDEO: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

VIDEO: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

NTR: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 3.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దిగువకు అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. అదే విధంగా కృష్ణా నది రైవస్ కాలువలకు 3,837 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజ్ నీటిమట్టం ప్రస్తుతం 10.5 అడుగులకు చేరింది.