జిల్లాలో ముంపునకు గురైన వరిచేలు

కోనసీమ: అమలాపురం మండలంలో భారీ వర్షాలకు వందల ఎకరాల వరిపొలాలు నీట మునిగాయి. జనుపల్లి, నల్లమిల్లి, ఏ. వేమవరం, నల్లచెరువు, నేదునూరు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల ఖరీఫ్ వరిచేలు నీటిలో ఉన్నాయి. కుమ్మరి కాలవ డ్రైనేజీ మూసుకుపోవడంతో నీరు వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.