చేనేత కార్మికులకు పూర్వవైభవం తీసుకొస్తాం: మంత్రి

కోనసీమ: చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చి, వారి బతుకుల్లో వెలుగులు ప్రచురింపజేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గురువారం రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా చేనేత కార్మికుల కష్టాలను మంత్రి విన్నారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.