'సెల్ టవర్‌ను తొలగించే చర్యలు తీసుకోవాలి'

'సెల్ టవర్‌ను తొలగించే చర్యలు తీసుకోవాలి'

RR: సెల్ టవర్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ అన్నారు. జోనల్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి వివిధ సమస్యలను విన్నవించారు. న్యూ నాగోల్ కాలనీలో రెసిడెన్షియల్ ఇళ్ల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేశారని, ప్రతికూల ప్రభావం చూపుతున్న సెల్ టవర్‌ను అక్కడి నుంచి తొలగించాలన్నారు.