మద్యం తాగి బైకు నడిపిన వ్యక్తికి 3 రోజుల జైలు

మద్యం తాగి బైకు నడిపిన వ్యక్తికి 3 రోజుల జైలు

నిజామాబాద్: మద్యం సేవించి బైక్ నడిపిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ శ్రేణి న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారని వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు తెలిపారు. సోమవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అర్సపల్లికి చెందిన ఆటోడ్రైవర్ దమ్ము నవీన్(22) బైక్ నడుపుతూ పట్టుబడగా మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్లు విజయ్ బాబు చెప్పారు.