జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

ATP: జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4069 మందికి 3937 మంది, ఒకేషనల్ విభాగంలో 1468 మందికి 1331 మంది హాజరయ్యారు. ఇంటర్ బోర్డు అబ్జర్వర్ సుబ్రమణ్యం 5 కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు.