బిల్లులు రాక.. పంచాయతీ భవనం తాకట్టు!

జగిత్యాల: తొంబరావుపేట మాజీ సర్పంచ్ మామిడి సత్తమ్మ ధర్మారెడ్డి, పంచాయతీ భవనం నిర్మించడానికి రూ.18 లక్షలు అప్పు చేసి, ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితిలో, అప్పు తీర్చేందుకు పంచాయతీ భవనాన్ని కట్లకుంట బ్యాంకులో తాకట్టు పెట్టించారు. ప్రభుత్వ బకాయిలు విడుదల చేయకుండా ఉంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.