వేరుశనక్కాయలతో గణేశుడు.. ఎక్కడంటే!

వేరుశనక్కాయలతో గణేశుడు.. ఎక్కడంటే!

AP: తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ చతుర్థి సందడి కొనసాగుతోంది. వినాయక చవితి సందర్భంగా పూజలు చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే, కాకినాడలో వెరైటీగా బొజ్జ గణపయ్య కొలువుదీరాడు. వేరుశనక్కాయలతో వినాయకుడుని కళాత్మకంగా ఏర్పాటు చేశారు. దీంతో ఈ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇక భక్తులు బొజ్జ గణపతిని దర్శించుకునేందుకు ఇప్పటి నుంచి వెళ్తున్నారు.