'నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి'

'నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి'

E.G: రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.67.58 కోట్లకు, ఇప్పటి వరకు రూ. 27.93 కోట్లు ఇంటి పన్నులు వసూళ్లు చేసినట్లు డీఎల్‌పీవో ఎం.నాగలత తెలిపారు. కడియం మండలం జేగురుపాడు, పొట్టిలంకలలో శుక్రవారం ఆమె పలు పిర్యాదులపై విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో146 పంచాయతిల్లో 41శాతం వసూలు కాగా నూరు శాతంకు ఆదేశాలిచ్చారు.