బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ADB: నార్నూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన కాంబ్లే హనుమంతరావు నిన్న విద్యుత్తు షాక్‌తో మరణించాడు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం బీఆర్ఎస్ నాయకులను బాధితుడి నివాసానికి పంపి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటంబ సభ్యులను ఆదుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీరామ్, రూపదేవ్ ఉన్నారు.