మాజీ ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరికలు
VZM: బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు సమక్షంలో బుధవారం స్దానిక కోమటిపల్లికు చెందిన పలు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధి జరగకపోవడంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు.