గణేశ్ లడ్డూ వేలం

గణేశ్ లడ్డూ వేలం

NGKL: అచ్చంపేటలో శ్రీ భక్త మార్కండేయ శివాలయంలోని వినాయక మండపం వద్ద లడ్డూ వేలం నిర్వహించారు. పట్టణానికి చెందిన సంబు శ్రీకాంత్ రూ.15 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆయన్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం వినాయకుని నడింపల్లిలో ఇప్పలచెరువులో నిమజ్జనం చేశారు. వనం పర్వతాలు, కోట కిషోర్, ధనరాజ్, రాములు, రమేష్, గీత, హైమావతి పాల్గొన్నారు.