VIDEO: గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు

GDWL: ఆలంపూర్ పుణ్యక్షేత్రంలోని సంకల్పసిద్ధి గణపతి ఆలయంలో బుధవారం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. అనంతరం వరసిద్ధి గణపతికి విశేష మంగళ నీరాజనాలు సమర్పించారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక హారతులు అందుకున్నారు.