VIDEO: 'దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి'
సత్యసాయి: హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ గుండాలు చేసిన దాడిని హిందూపురం వైసీపీ ఇంఛార్జి దీపిక ఖండించారు. ఆదివారం కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ గుండాలు వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన సమయంలో పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని పోలీసులు వ్యతిరేకించి దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు.