క్రీడలు పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయి: బీసీ రాజారెడ్డి

NDL: విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు ఎంతో అవసరమని క్రీడలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. గురువారం బనగానపల్లెలోని నెహ్రూ పాఠశాలలో జరిగిన కరాటే పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మోడల్స్, సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. కరాటే ఆత్మ రక్షణకు ఉపయోగపడుతుందన్నారు.