జిల్లాలో డిజిటల్-సమ్మిళిత విద్యకు వేగం
GNTR: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు కేంద్రం స్పందిస్తూ గుంటూరు జిల్లాలో డిజిటల్ విద్య పురోగతిని వెల్లడించింది. 2024–25లో 220 ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఇంటర్నెట్ సౌకర్యం, 67 ICT ల్యాబ్‌లు, 166 స్మార్ట్ తరగతి గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ చర్యలతో విద్యార్థులకు సాంకేతిక ఆధారిత బోధన అందుబాటులోకి వచ్చింది.