జిల్లాలో భానుడు భగ భగ

జిల్లాలో భానుడు భగ భగ

VKB: జిల్లాలో గురువారం భానుడు భగ్గుమన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత నవాబ్ పేట మండలంలో 41.8 సెల్షియస్ డిగ్రీలుగా నమోదైంది. పెద్దముల్, దుద్యాల, బంట్వారం, వికారాబాద్, యాలాల, కుల్కచర్ల, తాండూరు, కొండగల్, మోమిన్ పేట, మర్పల్లి, ధారూర్ మండలాల్లో 40.1 నుంచి 41.7 సెల్షియస్ డిగ్రీలుగా ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.