14 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

VZM: బొండపల్లి మండలంలోని వెదురువాడ గ్రామ పరిధిలో బుధవారం జూదం ఆడుతున్న 14 మందిని పట్టుకొని అరెస్ట్ చేశామని బొండపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. వారి నుంచి రూ. 1,01,170 తోపాటు 9 ద్విచక్ర వాహనాలు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.