ఈనెల 25న పురుషులకు వేసెక్టమీ ఆపరేషన్ శిబిరం

NGKL: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 25న పురుషులకు కుట్టు, కోతలేని వేసెక్టమి ఆపరేషన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘు తెలిపారు. ఆపరేషన్ పూర్తిగా ఉచితం అన్నారు. ఆపరేషన్ చేసుకునేవారు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.