మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే శిరీష

మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే శిరీష

SKLM: వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామన్నారు.