కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన

NGKL: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు వినూత్న ప్రదర్శన చేశారు. మింతాదేవి బొమ్మతో కూడిన టీ షర్టులు ధరించి నిరసన తెలిపారు. ఇటివల విడుదలైన బీహార్ ముసాయిదా ఓటరు జాబితాలో మొట్టమొదటి ఓటరుగా నమోదు చేసుకున్న మహిళ మింతాదేవి. ఆమె వయసు 124 సంవత్సరాలు. '124 నాట్ అవుట్' అనే నినాదాన్ని వారి టీ షర్ట్‌లపై రాసుకుని నిరసనలు చేపట్టారు. ఈ నిరసరలో జిల్లాకు చెందిన MP మల్లు రవి పాల్గొన్నారు.