పాముకాటుతో రైతు మృతి

GDWL: అలంపూర్ నియోజకవర్గంలో, మానోపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెందిన వెంకట్ రాంరెడ్డి (77) అనే రైతు బుధవారం పంట పొలంలో కాడెద్దులతో సేద్యం చేస్తుండగా పాముకాటుకు గురయ్యారు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.