గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

WNP: వీపనగండ్ల మండల కేంద్రం నుంచి బెక్కెం రూ.3.90 కోట్లతో నిర్మించనున్న రహదారికి ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, దీని కోసం ప్రజలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. వీపనగండ్ల నుంచి బెక్కెం బీటీ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.