'GWMC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి'
HNK: రాబోయే GWMC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. 43వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆరూరి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలంతా తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.