పెట్రోల్‌పై లీటర్‌కు రూ.80 తగ్గింపు

పెట్రోల్‌పై లీటర్‌కు రూ.80 తగ్గింపు

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ సామాన్యులకు భారీ ఊరటనిచ్చింది. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 80 పాకిస్థానీ రూపాయలను తగ్గిస్తున్నట్లు అక్కడి ప్రధాని ప్రకటించారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో దిగివచ్చిన సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరల తగ్గింపు తక్షణమే అమలులోకి రానుంది.