‘అవిశ్రాంత దృఢ సంకల్పానికి విజయం నిదర్శనం’

‘అవిశ్రాంత దృఢ సంకల్పానికి విజయం నిదర్శనం’

మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిందని, మన బిడ్డలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారని ఆయన కొనియాడారు. ఈ అద్భుతమైన విజయం జట్టులోని క్రీడాకారిణుల అవిశ్రాంత దృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిని ఇస్తుందని చంద్రబాబు 'X'లో తెలిపారు.