పశువులకు గాలికుంట వ్యాధి టీకాలు

CTR: పశువులకు గాలికుంట వ్యాధి సోకకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు పేర్కొన్నారు. శాంతిపురం మండలం కెనమాకులపల్లిలో పశువులకు గాలికుంట వ్యాధికి సంబంధించి టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి రైతు తమ పశువులకు గాలికుంట వ్యాధులకు సంబంధించిన టీకాలు వేయించుకోవాలని సూచించారు.