VIDEO: ఈ మార్గంలో వాహనం బ్రేక్ డౌన్
RR: రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వాహనం బ్రేక్ డౌన్ అయింది. దీంతో షేక్ పేట్ ఫ్లైఓవర్ నుంచి ఖాజాగూడ జంక్షన్ వెళ్లే మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తొలగించేందుకు, ట్రాఫిక్‌ను సజావుగా నియంత్రించడానికి కృషి చేస్తున్నారు. వాహనదారులు సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.