VIDEO: 'ప్రకృతి వైద్యమే శాశ్వత ఆరోగ్య మార్గం'

VIDEO: 'ప్రకృతి వైద్యమే శాశ్వత ఆరోగ్య మార్గం'

MDK: నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో రామాయంపేట లయన్స్ క్లబ్ ప్రకృతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ టీవీకే చారి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉరుకుల, పరుగుల జీవితాల్లో ఎప్పుడు ఏ విధంగా రోగాలు సంభవిస్తాయో తెలియదన్నారు. అన్ని రోగాలకు ప్రకృతి వైద్యమే శాశ్వత ఆరోగ్య మార్గమని తెలిపారు.