ఘనంగా పోలిపల్లి పైడితల్లి జాతర
VZM: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ ఘనంగా జరుగుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు. ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు.