'రాయి క్వారీ తవ్విన ప్రాంతాన్ని పూడ్చి వేయాలి'

'రాయి క్వారీ తవ్విన ప్రాంతాన్ని పూడ్చి వేయాలి'

ASR: జీ.మాడుగుల మండలం నిట్టాపుట్టు కంబాలబయలు వద్ద రాయి క్వారీ తవ్విన ప్రాంతాన్ని వెంటనే పూడ్చి వేయాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు రాజుబాబు డిమాండ్ చేశారు. శనివారం క్వారీ ప్రాంతాన్ని సందర్శించారు. అనుమతికి మించి అక్కడ తవ్వకాలు జరిపారని ఆరోపించారు. అక్కడ సుమారు 100 అడుగుల లోతు తవ్వారని, ఆ గోతులు పూడ్చకుండా వదిలేశారన్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.