ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించిన ముస్లిం సోదరులు

ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించిన ముస్లిం సోదరులు

VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని తన నివాసంలో శుక్రవారం కొత్తవలస ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తవలసలో 250కి పైగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. అయితే అక్కడ స్మశాన వాటికకు రాకపోకలకు సరైన దారి లేక అత్యంత ప్రమాదకర పరిస్థితిలో దహన సంస్కారాలు చేయవల్సి వస్తుందని వాపోయారు. సమస్య పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు.