జమ్మికుంట మున్సిపాలిటీ స్టేట్ ఫస్ట్
KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఇంటి పన్నులను 100 శాతం వసూలుచేసి రాష్ట్రవ్యాప్తంగా 2వ సారి స్టేట్ ఫస్ట్ సాధించి చరిత్ర సృష్టించిందని మున్సిపల్ ఛైర్మన్ మొలుగు దిలీప్ తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మహమ్మద్ అయాజ్‌తో కలిసి ఇంటి పన్ను వసూళ్లలో కృషి చేసిన మున్సిపల్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు.