ప్రయాణికులను పరుగులు పెట్టిస్తున్న ఆర్టీసీ బస్సులు
విజయనగరం నుండి అనకాపల్లి వెళ్ళే బస్సులు నిర్దేశించిన బస్ స్టాప్‌ల వద్ద ఆపకపోవడంతో ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు. ఉచిత బస్సుల పథకం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చోదకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. బస్ స్టాప్ ల వద్ద బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.