మెరుగైన వైద్యం అందించాలి: మాజీ ఎంపీ

మెరుగైన వైద్యం అందించాలి: మాజీ ఎంపీ

MHBD: కేసముద్రం మార్కెట్ మాజీ ఛైర్మన్, BRS సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి తల్లి పూలమ్మ అస్వస్థతకు గురై HYDలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న BRS జిల్లా అధ్యక్షురాలు, మాజీ MP మాలోతు కవిత శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.