మెడికల్ షాపు యజమాని ఆత్మహత్య

TPT: కోట పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంక్ పరిధిలో నివాసం ఉంటున్న కృష్ణారెడ్డి(58) ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే మెడికల్ షాపు నిర్వహిస్తున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందారు. కాగా, మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.